తెలుగు ప్రేక్షకులకు అలనాటి హీరో అయిన కాంతారావు సుపరిచితమే. దాదాపు 400లకు పైగా పౌరాణిక.. జానపద.. సాంఘిక చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకున్నారు

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన విలక్షణమైన నటనతో ఎంతగానో మెప్పించారు. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంతారావు శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని మరీ సినిమాలు తీశారని.. ఒకప్పుడు మద్రాసు బంగ్లాలో ఉన్న మేము.. ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామంటూ ఎమోషనల్ అయ్యారట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించి .. ఇల్లు కేటాయించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన కాంతారావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరై కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు కూడా అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంతారావు కుమారుడు రాజా, ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం .

కాంతారావు శత జయంతి కార్యక్రమాన్ని ఆయన కొడుకులిద్దరు కలిసి ఇంటి వద్ద నిర్వహించిన ఓ ఫోటోను సినీ నటుడు సీవీఎల్ నరసింహారావు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారట. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వ పడేలా అంగరంగ వైభవంగా ఇవాళ జరిగిన కాంతారావు గారి శతజయంతి కార్యక్రమంలో ఆయన కుమారులు’ అంటూ కూడా రాసుకొచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *