ఒకప్పుడే కాదు ఇపుడు కూడా సినిమా వాళ్ళు అంటే చాలా మంది తక్కువ చేసి చూస్తారు. ఐతే సినిమాల్లో నటించడానికి వాళ్ళు పడే కష్టం మాములు కష్టం కాదు ఈ కష్టం అనేది చిన్న హీరో నా పెద్ద హీరోనా అని ఉండదు.అందరు కూడా ఎవరి స్థాయి లో వాళ్ళు కష్టపడాల్సిందే.

ఐతే ఇందులో భాగంగానే జనాలు తమను ఆదరించాలి అంటే కేవలం నటన మాత్రమే సరిపోదు వారి బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతీ ఒక్కటి వాళ్ళు గమనిస్తారు.దీని కోసం వాళ్ళు ఆహారం, ఆరోగ్యం, ఆకృతి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు.

కష్టపడే వాళ్ళల్లో ఒక స్టార్ ఐనా సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకే రోజులో రెండు మూడు షిఫ్టులలో మూవీ షూటింగ్లలో పాల్గొంటూ ఆయన బిజీగా గడిపే వారు. ఇలా చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం. అంతకు ముందు ఇలా ఎవరు చేయలేదు ఆయన తర్వాత ఇంకెవరు చేయలేదు.ఎంత బిజీ షెడ్యూల్డ్ ఐనా సరే ఆరోగ్యం విషయంలో మాత్రం కృష్ణ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని గూఢచారి 117 మూవీ రచయిత ఐనా తోటపల్లి మధు కృష్ణగారి ఆరోగ్య రహస్యాలు పంచుకున్నారు.

ఒకవేళ ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ గారికి షూటింగ్ ఉంటే కచ్చితంగా ఆయన ఇంట్లోనే టిఫిన్ కార్యక్రమాలన్నింటిని పూర్తిచేసుకుని లొకేషన్లోకి బయలుదేరి వస్తారంట.లొకేషన్లో షూటింగ్ టైం లో బిజీగా ఉన్నా సరే కృష్ణ ఎగ్జాట్ గా 11 గంటలకు తప్పనిసరిగా పెరుగు వడ తినే వారట మళ్ళా ఒంటి గంటకు భోజనం కచ్చితంగా చేస్తారని. మూడు గంటలకు తప్పనిసరిగా సున్నుండలు ఉండాలని ఐదు గంటలకు గోధుమ రవ్వతో తయారు చేసిన దోసెలు ప్రత్యేకంగా హోటల్ నుంచి తెప్పించేవారని తోటపల్లి మధు గారు ఒక ముఖాముఖీ సంభాషణలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *