ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా తాజాగా తన కూతురు సినీ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె దీనిపై మాట్లాడింది. ఈరోజు ఆ శ్రీ వారి దర్శనం చేసుకోవడం ఎంతో బాగుంది.

రాజకీయాలలో మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మరింత శక్తి ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. అన్నారు. అలాగే ఆమె కూతురు అన్షు మాలిక యాక్టింగ్ చేస్తానంటే వద్దు అనను అని అన్నారు. తన కూతురు సినిమాల్లోకి వస్తే తానే సంతోషిస్తాను అన్నారు.

అయితే తన కూతురు కి సైంటిస్ట్ అవ్వాలనే కోరిక ఉందని ఆమె అన్నారు. ఆమె ప్రస్తుతం బాగా చదువుతోంది. ఇప్పటకైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు అన్నది. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అని చెప్పింది.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణికి అన్షు మల్లికా కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా సినిమాల్లో అగ్రతారగా కొనసాగిన విషయం తెలిసిందే. బుల్లితెరపైనా కూడా ఆమె తన జోష్ చూపిస్తుంది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా రాణిస్తున్నారు. ప్రతిపక్షాలను తన మాటలతో భయపెట్టే మహిళా నేత రోజా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *