అవును.. మీరు వింటున్నది నిజమే. మళ్లీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనున్న ఆర్ జె సూర్య.నేను మూడు వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాను అంటూ అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజెన్స్, ఇనయా అభిమానులు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే సూర్య ఎలిమినేట్ అయినప్పటినుండి ఇనయా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతోంది.

అంతేకాదు ఈమె టైటిల్ రేస్ లో కూడా దూసుకు పోతుండడంతో ఒకవేళ మళ్లీ సూర్య హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఇనయా పరిస్థితి ఏంటి అంటూ ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇక ఆర్ జె సూర్య అందరిని ఎంటర్టైన్ చేస్తూ టాప్ ఫైవ్ లో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా 8వ వారమే ఎలిమినేట్ అయ్యాడు.సూర్య ఎలిమినేట్ అయ్యాక ఇనయ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతుంది. అయితే హౌస్ లో ఇంకా 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు.ఇప్పటికే 10 వారాలు కూడా గడిచిపోయింది. అయితే ఈ టైంలో వైల్డ్ కార్డు ఎంట్రీ లు ఉండకపోవచ్చు.

కానీ ప్రస్తుతం ఆర్ జే సూర్య పెట్టిన పోస్ట్ వల్ల ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఈ మధ్యనే ఆర్ జె సూర్య తన సోషల్ మీడియా ఖాతాలో ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పటినుండి ఓ లెక్క సూర్య భాయ్ బ్యాక్ టు యాక్షన్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది జనాలు మళ్ళీ హౌస్ లోకి వెళుతున్నాడు కావచ్చు వద్దు బాబోయ్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మరోసారి బిగ్ బాస్ సెట్ నువ్వు ఊపిరి పీల్చుకో నేను మూడు వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో మరొక పోస్ట్ పెట్టాడు.

ఇక ఈ పోస్ట్ చేసిన జనాలంతా ఈయన మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? అంటూ కంగారు పడుతున్నారు. కానీ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.ఎందుకంటే అతను హౌస్ లోకి కాదు. అరియానా గ్లోరి నిర్వహించే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి గెస్ట్ గా వచ్చాడు. ఇక ఈ విషయం ఆయన పోస్ట్ పెట్టినదాని కింద బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అనే హ్యాష్ ట్యాగ్ చూస్తే అందరికీ అర్థమయిపోతుంది.ఇక ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ అందరూ హమ్మయ్య ఆయన రావడం లేదు కదా అని ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *