తెలుగు చలనచిత్రం మూల స్తంభం సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 వ తేదీన కాలం చేసిన విషయం తెలిసిందే ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యలతో కాంటినెంటల్ ఆసుపత్రికి చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం రోజు తెల్లవారుజామున 4:09 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి సినీ రాజకీయ నాయకులు నానక్ రామ్ గూడాలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నివాళులు అర్పించారు.

Naresh And Pavithra Lokesh Exclusive Visuals At Padmalaya Studios | Super  Star Krishna | NewsQube - YouTubeబుధవారం నుండి కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియో వద్ద ఉంచగా అక్కడికి భారీ స్థాయిలో అభిమానులు, సినిమా తారలు , రాజకీయ నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించారు. అటు తర్వాత మహేష్ బాబు దహన సంస్కారాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమంలో కృష్ణ గారి రెండవ భార్య కుమారుడు సీనియర్ నటుడైన నరేష్ కూడా పాల్గొన్నారు. అలాగే పద్మాలయ స్టూడియో నుండి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు జరిగిన అంతిమయాత్ర కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు కూడా పాల్గొన్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. కృష్ణ గారి అంతిమయాత్రలో కూడా నరేష్ – పవిత్ర జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మేము స్నేహితులము అని..పైకి చెప్పుకొని తిరిగే వీరి వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. మరోపక్క ఒకే ఏడాది లో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయి మహేష్ పూర్తి స్థాయిలో ఢీలా పడిపోయి ఉంటే నరేష్ మాత్రం ఇలా ఏమీ పట్టనట్టుగా ఆమెను వెనకేసుకొని తిరుగుతూ ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కృష్ణ అంతిమయాత్రలో కూడా నరేష్ పవిత్ర లోకేష్ ను విడిచి పెట్టకపోవడం చూసి పవిత్ర లోకేష్ అంటే నరేష్ కు ఇంత పిచ్చా అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాదు అలాంటి సమయంలో కూడా వీరికి ఇదేం బుద్ధి అంటూ విపరీతంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *