సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం రోజు తెల్లవారుజామున మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈయన మరణంతో ఒక మంచి నటుడిని కోల్పోయాం అంటూ సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మహేష్ బాబు దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. ఎందుకంటే ఇప్పటికే అన్న,అమ్మ పోయిన బాధలో ఉండి నెల తిరగక ముందే ఇంతలోనే తండ్రి చనిపోవడంతో ఇక ఆయనను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈయన మరణ వార్త వినగానే చాలామంది రకరకాలుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక బుధవారం రోజు సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

అయితే కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేష్ బాబు పై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే మహాప్రస్థానంలో కాకుండా తమ సొంత స్థలంలో అంత్యక్రియలు జరిపి ఉంటే బాగుండేది కదా అని భావిస్తున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు హైదరాబాదులో చాలా ఏరియాల్లో మంచి మంచి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలంలో కృష్ణ గారి అంతక్రియలు జరిపిస్తే బాగుండేది కదా అని చాలామంది భావిస్తున్నారు. పెద్దపెద్ద సినీ ప్రముఖులు మరణించినప్పుడు వారి సొంత స్థలాల్లో లేదా ప్రైవేటు స్థలంలో అంత్యక్రియలు నిర్వహించి అక్కడ సమాధి కట్టుకోవడం అనేది ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖుల విషయంలో చూసాం. ఇక ఇటీవల మరణించిన కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా ఈ విధంగానే నిర్వహించారు.

ఇక సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు మాత్రం ప్రభుత్వం స్థలం ఇచ్చింది కాబట్టి అందులో అంత్యక్రియలు చేశారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంతక్రియలు చేశారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే కృష్ణకు కూడా పద్మాలయ అనే స్టూడియో ఉంది కదా. దానికి సమీపంలో ఐదు ఎకరాల స్థలం ఉంది అందులో కృష్ణ అంత్యక్రియలు చేస్తే బాగుండేది కదా, లేకపోతే దానికి దగ్గరలోనే మహేష్ బాబుకి 30 ఎకరాల స్థలం ఉంది. ఆ ప్లేస్ లో కృష్ణ అంతక్రియలు చేస్తే బాగుండు కదా అని చాలామంది సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాదులో ఎన్నో స్థలాలు ఉన్నాయి అలాంటిది ఒక్క ఎకరం స్థలం కృష్ణకు కేటాయించి, ఆయన అంత్యక్రియలు జరిపించి, స్మారక మందిరం కట్టిస్తే బాగుండేది కదా అని చాలామంది టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు.

ఒకవేళ తన రెండో భార్య విజయ నిర్మల బతికుంటే ఇలా చేయనిచ్చేది కాదు అని చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం లో కనీసం నరేష్ కి తన తల్లి విజయనిర్మల మీద ఉన్న ప్రేమ కూడా మహేష్ బాబు కి తన తండ్రి కృష్ణ మీద లేదు అంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కృష్ణ అంత్యక్రియల విషయంలో పూర్తి నిర్ణయం మహేష్ బాబుదే అని చాలామంది ఆయనను తప్పుబడుతున్నారు. కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా వినకుండా మహేష్ ఇలా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు చేయడం రమేష్ బాబు భార్య మృదుల, అలాగే ఆదిశేషగిరిరావు,మరి కొంతమంది కుటుంబ సభ్యులు వ్యతిరేకించారట. కానీ ఈ విషయంలో మహేష్ బాబు ఎవరి మాటలు వినిపించుకోలేదని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *