సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్.. హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే సోషల్ మీడియా వేదికగా నిర్దారించారు.

2019లో విడుదలైన దేవరాట్టం లో కలిసి నటించిన వీరిద్దరు ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందట.. అయితే వీరిద్దరు రిలేషన్‏షిప్‏లో ఉన్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టగా.. వాటిని నిజం చేస్తూ తమ బంధాన్ని అధికారికంగా ఆమె ప్రకటించారు. అంతేకాదు. ఈనెల 28న చెన్నై సమీపంలోని ఓ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి సన్నిహితులు.. బంధువులు.. కొద్ది మంది స్నేహితులు.. సినీ ప్రముఖులు రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఇన్ స్టా ఖాతాలోని ఫోటోస్ అన్నింటిని డెలిట్ చేసి అందరికి షాకిచ్చింది మంజిమా.

దీంతో ఆకస్మాత్తుగా మంజిమా ఫోటోస్ డెలిట్ చేయడంపై అనేక సందేహాలు కూడా వ్యక్తం చేశారు అభిమానులు. తాజాగా తాను ఫోటోస్ డెలిట్ చేయడంపై స్పష్టతనిచ్చింది. గత జ్ఞాపకాలను తొలగించేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నానను.. కాబట్టి నా పాత జ్ఞాపకాలను చూసుకుని బాధపడకూడదనే ఇన్ స్టాలో ఫోటోస్ కూడా డెలిట్ చేశాను.

అంతేకాకుండా కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికి చోటు అవసరం కావడం కూడా అంటూ చెప్పుకొచ్చిందట . కేవలం కాభోయే భర్త గౌతమ కార్తీక్‏ తో ఉన్న ఫోటోస్ మాత్రమే తన ఇన్‏స్టాలో ఉంచారు మంజిమా. ప్రస్తుతం మంజిమా.. స్టా్ర్ హీరో శింబు సరసన పతుతాళ చిత్రంలో నటిస్తుందట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *