గత వారం లో వచ్చిన జబర్దస్త్ కామెడీ షో తో పరిచయం ఐనా సౌమ్య రావు తన దైన స్టైల్ లో యాంకరింగ్ చేసి ప్రేక్షకులతో పాజిటివ్ మార్క్ వేపించుకుంది. ఐతే జబర్దస్త్ షో లో అడుగుపెట్టిందో లేదో సౌమ్య రావు రీల్స్ చేయడం కూడా మొదలుపెట్టింది. ఐతే ప్రెజెంట్ సిని హీరోయిన్స్ తో పాటుగా ధీటుగా బుల్లితెర భామలు కూడా సోషల్ మీడియా లోబాగా యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను పెంచుకునే పనిలో ఉన్న పడ్డారు.

ఐతే వీరు ఈ విధంగా ఫాలోయర్స్ ను పెంచుకుంటూనే సోషల్ మీడియా ద్వారా మనీ సంపాదించుకుంటున్నారు. ఇటీవల జబర్దస్త్ షో లో యాంకర్ గా అడుగుపెట్టిన సౌమ్య రావు కూడా తన స్టైల్లో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అసలు సౌమ్య జబర్దస్త్ లో ఏంట్రీ కి కారణం లేకపోలేదు అది జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోవడంతో దాంతో మొదట్లో ఎక్స్ట్రా జబర్దస్త్ హ్యాండిల్ చేస్తున్న యాంకర్ రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా చేయమని చెప్పారు నిర్వాహకులు. ఎలాగైతే నే కొన్ని రోజులు పాటు ఆమెతో ఆ షో ని నెట్టుకొచ్చారు. ఐతే తాజాగా సౌమ్య రావును ఫీల్డ్ లోకి దించారు. ఎంతో అందంగా కనిపించే సౌమ్య రావు జబర్దస్త్ వేదికపై లెగ్ పెట్టగానే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దింతో అనసూయ, రష్మీల స్థానాన్ని భర్తీ చేస్తూ బుల్లితెరపై తన మార్క్ చూపించింది.

ఆమెలో కామెడీ యాంగిల్ తో పాటు కొత్తదనం కనిపించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియా లోను సౌమ్య చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది.తన అప్డేటెడ్ ఫొటోస్ని మరియు వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె సోషలమీడియా లవర్స్ ని ఆకట్టుకుంటుంది.ఐతే ప్రెజెంట్ రీల్స్ ద్వారా కూడా తనకంటూ ఫ్యాన్స్ ను ఏర్పర్చుకుని పనిలో పడింది.దీనితో నేటిజన్లు అపుడే లైన్లో పడ్డ సౌమ్య అని సోషల్ మీడియా వేదికగా అంటున్నారు.

దీనితో జబర్దస్త్ అభిమానులు, సన్నిహితులు మరియు సోషలమీడియా ఫ్యాన్స్ అందరుకూడా ఆమెకి వెల్కమ్ చెప్పి ఆమె కు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలలని సోషలమీడియా వేదికగా దీవెనలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *