బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు ఎంతోమంది టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆదరించి వారిని ఉన్నత స్థానానికి చేర్చింది. ప్రస్తుతం జబర్దస్త్ కి వున్న ఆదరణ చూసి ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమాలు కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే జబర్దస్త్ సహా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమాలకు మూల స్తంభంగా కొనసాగుతూ ఇక కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

జబర్దస్త్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్న ఆది తన స్క్రిప్ట్ రైటింగ్ తో మిగతా షోలకి కూడా ప్రాణం పోస్తున్నాడు. అంతేకాదు ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో మూల స్తంభంగా ఉన్న ఆది మొదటి సారి పారితోషకం పై స్పందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎప్పుడు తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది ఇలా పారితోషకం విషయంపై స్పందించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గతంలో కూడా ఎంతోమంది హైపర్ ఆది రెమ్యునరేషన్ పై తమ ఊహాగానాలను సోషల్ మీడియాలో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయంపై స్వయంగా హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు స్క్రీన్ మీద చూపించారు. అందుకు సెలబ్రిటీలు కూడా సమాధానం చెప్పారు. దీంతో హైపర్ ఆది రెమ్యునరేషన్ ఎంత అన్న ప్రశ్నకు ఆది సమాధానం చెప్పాడు.

కానీ అతని వాయిస్ మ్యూట్ చేశారు. దీంతో అతని సమాధానం తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఎపిసోడ్లోని ఈయన పారితోషకం ఎంత అనేది రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యాంకర్ రష్మి, జబర్దస్త్ నరేష్ లాంటివారు కూడా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *