వైద్య అవసరాలకు చాలా మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా ఉన్నాయి.. బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (Health Insurance) ఆసుపత్రిలో చేరడాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులలో డాక్టర్ సంప్రదింపులు మరియు మందులు, రోగ నిర్ధారణలకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి. క్యాష్‌లెస్‌ OPD ఉన్న పాలసీ (Polocy) అటువంటి ఖర్చులను అయితే కవర్ చేస్తుంది. ఇలాంటి క్యాష్‌లెస్ OPD బినిఫిట్ ఉండే హెల్త్ పాలసీతో లబ్ధిదారులు చేతినుంచి చేసే ఖర్చులను అయితే తగ్గించుకోవచ్చు. ఓవర్-ది-కౌంటర్ మందులు లేదా వైద్య పరీక్షలు అవసరమయ్యే వ్యాధులకు గురయ్యే చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

క్యాష్‌లెస్‌ OPDలో ప్రొఫెషనల్ ఫీజులు, డయాగ్నస్టిక్ ఫీజులు, మెడిసిన్ బిల్లులు, పగుళ్లకు చికిత్సలు, దంత చికిత్సలు, ఆథరైజ్డ్‌ డయాగ్నస్టిక్ సెంటర్‌లు, దంత సంరక్షణ కేంద్రాలు, ఫార్మసీల నుంచి మైనర్ సర్జరీలు కూడా ఉంటాయి. చాలా ఇన్సూరెన్స్‌ (Insurance) కంపెనీలు కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు, వాకర్స్ వంటి అంబులేటరీ డివైజెస్‌ను, వాటికి అయ్యే ఖర్చులను కూడా OPD నుంచి మినహాయించాయి.

ఒకే ప్రీమియం మొత్తంతో లభించే క్యుములేటివ్ బోనస్ పోస్ట్ క్లెయిమ్ నష్టాన్ని రక్షించే గ్యారంటీడ్‌ క్యుములేటివ్ బోనస్‌ పాలసీని కూడా ఎంచుకోవాలి. క్లెయిమ్‌తో సంబంధం లేకుండా, సంవత్సరానికి 25-30 శాతం గ్యారెంటీ క్యుములేటివ్‌ బోనస్‌ను అందించే కొన్ని హెల్త్‌ (Health) ప్లాన్స్‌ ఉన్నాయి. బోనస్‌ ఇన్సూరెన్స్‌ (Insurance) మొత్తంలో 200 శాతం వరకు అయితే ఉంటుంది.

అయితే, ఈ మొత్తానికి ఫ్రెష్‌ కవరేజీని ఎంచుకుంటే, అదనపు ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాల రెన్యూవల్‌ తర్వాత వర్తించే ప్రీమియంపై లాయల్టీ తగ్గింపును అందించే పాలసీని సెలక్ట్‌ చేసుకోవడం అయితే మంచిది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ద్వారా పాలసీని (Polocy) రెన్యూవల్‌ చేస్తే లేదా బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ నుంచి నేరుగా డెబిట్ చేయడం ద్వారా పాలసీని రెన్యూవల్‌ చేస్తే అదనపు తగ్గింపులను కూడా అందిస్తాయి.

ఆసుపత్రిలో చేరడం వల్ల పాలసీ సంవత్సరంలో ఇన్సూరెన్స్‌ (Health Insurance) మొత్తం అయిపోతే రెన్యూవల్‌ ప్రయోజనాలను అందించే పాలసీని (Polocy) తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో ఆదర్శవంతమైన ఫీచర్‌ అని తెలిపారు. ఎక్కువగా జేబు నుంచి చెల్లించడం లేదా డిడక్టబుల్‌తో కూడిన ప్లాన్‌ను నివారించాలని కూడా ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *