సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఒక గొప్ప నటుడిని మనం కోల్పోయాం. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చారంటే కచ్చితంగా కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటారు. ఇక కృష్ణ అలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం వెనుక ఒక కారణం ఉందట. ఇక ఆ కారణాన్ని స్వయంగా తన భార్య విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

కృష్ణ విజయనిర్మలను ప్రేమించి 1969 పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి జరిగిన సమయం నుండి కృష్ణ ఎక్కడికి వెళ్ళినా అతని వెంటే విజయనిర్మల కూడా వెళ్తూ ఉండేది. ఇక అలా కృష్ణ వెంబడి ఎందుకు వెళ్లేదో కూడా విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కృష్ణని పెళ్లి చేసుకున్నప్పటినుండి అతన్ని రక్షించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాను. బయటికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఆడవాళ్లు కనిపిస్తే వెంటనే కృష్ణకి కూలింగ్ గ్లాసులు పెట్టేదాన్ని.

దానికి కారణం ఏంటంటే..బయటి ఆడవాళ్లు ఎవరైనా కృష్ణ కళ్లలోకి నేరుగా చూస్తే ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. వేరే ఆడవాళ్ళ కళ్ల లోకి ఆయన సూటిగా చూసేవారు కాదు.అందుకే కృష్ణకి నేను కూలింగ్ గ్లాసులు పెట్టేదాన్ని అంటూ విజయనిర్మల ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే కృష్ణ విజయనిర్మల కలిసి చెన్నైలోని మీసాల కృష్ణుడు గుడిలో ఓ పాట షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఆ టైం లో విజయనిర్మల, కృష్ణ ఇద్దరు బయటికి వచ్చారట.

వారితో పాటు కమెడియన్ రాజబాబు కూడా ఉన్నారట. ఇక రాజబాబు విజయనిర్మల, కృష్ణను ఉద్దేశించి ఈ గుడిలో షూటింగ్ పెళ్లి చేసుకున్న వారంతా నిజంగానే భార్య భర్తలు అయ్యారు. ఇది చాలా మహిమగల గుడి అంటూ సరదాగా చెప్పుకొచ్చారట. ఇక విజయనిర్మల కృష్ణ విషయంలో చివరికి రాజబాబు చెప్పిన జోస్యమే నిజమైంది అని ఆ ఇంటర్వ్యూలో విజయనిర్మల తెలియజేసింది. ఏది ఏమైనప్పటికీ కృష్ణ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడానికి కారణం ఇదా అంటూ చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *