టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయన వివాదాలకు దూరంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి సినిమాలు తెరకెక్కించారు. అయితే ఇలాంటి మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ ని కొంతమంది జనాలు రాళ్లతో కొట్టారట. మరి వాళ్ళు రాళ్లతో కొట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి ఎదురు తిరిగిన ఒకే ఒక వ్యక్తి హీరో కృష్ణ. అయితే కృష్ణ అప్పుడు ఉన్న టిడిపి గవర్నమెంట్ పై సెటైర్ వేస్తూ తన సొంత స్టూడియోలో ఒక సినిమాను తెరకెక్కించారట. ఇక ఆ సినిమా చూసినా టిడిపి శ్రేణులు అప్పటినుండి కృష్ణ మీద పగ పెంచుకున్నారట. అయితే 1985 లో కృష్ణ మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా షూటింగ్ కోసం నంద్యాల ఊరికి వెళ్ళాడట. అక్కడికి వెళ్లాక రైల్వే ఫారెస్ట్ బ్రిడ్జి మీద ఓ సీన్ షూటింగ్ జరిపారట.

ఇక అదే టైంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారట కృష్ణ. అయితే ఆ ప్రచారం ముగిసే సరికి అర్ధరాత్రి 10 గంటలు అయింది. ఆ టైంలో కృష్ణ కర్నూలు వెళుతున్న టైం లో కొంతమంది టిడిపి శ్రేణులు అదే అదనుగా భావించి కృష్ణపై రాళ్లతో దాడి చేశారట. ఇక రాళ్లదాడిలో కృష్ణ కంటికి తీవ్రమైన గాయమైందట. దాంతో దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కృష్ణ తన కంటికి కుట్లు వేయించుకొని మరీ ఆ తర్వాత జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు.

ఇక ఆ టైంలో కూడా తమ అభిమాన హీరో కృష్ణ వచ్చాడు అని తెలిసి చూడ్డానికి చాలామంది జనాలు వచ్చారట. ఇలా అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వమైనా టిడిపి పార్టీ పై వ్యతిరేకంగా సినిమా తీసినందుకు టిడిపి శ్రేణులు ఆయనపై రాళ్లతో దాడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *