ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ (Scooter) తయారీ సంస్థ అయిన’బజాజ్ ఆటో’ దేశీయ మార్కెట్లో ‘పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌’ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ (Bike) ధర ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ‘బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌’ ప్రారంభ ధర రూ. 89,254 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది రెండు కూడా వేరియంట్స్ లో అందుబాటులోకి అయితే ఉంది.. అవి సింగిల్ సీట్ వేరియంట్ మరియు స్ప్లిట్ సీట్ వేరియంట్స్.

బజాజ్ (Bajaj) యొక్క కొత్త పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ సింగిల్ సీట్ వేరియంట్ ధర రూ. 89,254 కాగా, స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ. 91,642 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే సమయంలో ఈ బైక్ బ్లూ మరియు రెడ్ అనే రెండు కలర్ ఆప్సన్స్ కూడా పొందుతుంది. అయితే ఈ రెండు వెర్షన్లు బ్లాక్ కలర్ కోటింగ్ కూడా పొందుతాయి. కాగా వీల్స్, ఫ్యూయల్ ట్యాంక్, వెనుక ప్యానెల్‌లతో సహా వివిధ బాడీ ప్యానెల్‌లపై కార్బన్ ఫైబర్ గ్రాఫిక్‌లను మనం చూడవచ్చు.

ఈ బైక్ యొక్క గ్రాఫిక్ డిజైన్ కాకుండా ఇందులో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ అయితే ఏమి లేదు. కావున ఈ కొత్త ‘బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌’ అదే 124.4 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.64 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.80 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అయితే చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుందని సమాచారం.

కొత్త పల్సర్ (Pulsar) 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ ఉంది.. అదే సమయంలో ఈ బైక్ (Bike) 240 మిమీ డిస్క్ బ్రేక్ , 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.

బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్ 80/100 x 17 మరియు 100/90-17 ట్యూబ్‌లెస్ టైర్‌లతో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే పల్సర్ 125 యొక్క స్ప్లిట్ సీట్ వెర్షన్ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్‌ పొందుతుంది, సింగిల్ సీట్ వెర్షన్‌లో వన్-పీస్ గ్రాబ్ రైల్ మాత్రమే లభిస్తుందని తెలుస్తుంది.

భారాతీయ మార్కెట్లో టూ వీలర్ విభాగంలో బజాజ్ పల్సర్ బైక్ (Bike) మంచి అమ్మకాలలో ముందుకు సాగుతోంది. ఈ సమయంలో కంపెనీ మరో అప్డేటెడ్ బైక్ (Bike) విడుదల చేయడం వల్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నాము. అయితే ఈ కొత్త బైక్ ఎలాంటి అమ్మాకాలను కూడా పొందుతుంది

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ‘బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్’ (Bajaj Pulsar 125 Fiber Edition) తన పల్సర్ 125 నియాన్ ఎడిషన్‌తో పాటు విక్రయించబడే అవకాశం కూడా ఉంటుంది. ఈ కొత్త బైక్ దేశీయ విఫణిలో హోండా (Honda) SP125 మరియు హీరో గ్లామర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా అయితే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *