టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. బాధ్యతలను నిర్వర్తించి రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్న కృష్ణ అంటే ప్రతి ఒక్కరికి మంచి గౌరవమని చెప్పాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రాలో ఎన్టీఆర్ ను ఎదిరించే నాయకుడు కావాలని కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న సమయంలోనే ఇందిరాగాంధీ మరణించారు.ఇక ఆమె అంత్యక్రియలకు హాజరైన కృష్ణ తో రాజీవ్ గాంధీకి మంచి స్నేహం ఏర్పడింది.Superstar Krishna Joined Congress In NTR's Wave!

అలా రాజీవ్ గాంధీతో ఏర్పడిన ఈ స్నేహం కారణంగానే ఆయన ఆహ్వానం మేరకు ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి 71 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు కృష్ణ. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎన్టీఆర్ ను ఎదిరించే దమ్మున్న నాయకుడు కృష్ణ మాత్రమే అని భావించి కృష్ణను సీఎం చేయడానికి రాజీవ్ గాంధీ అహర్నిశలు కృషి చేశారు. వచ్చే ఎన్నికలలో కృష్ణ సీఎంగా పోటీ చేస్తారు అనే వార్తలు కూడా వినిపించాయి. అదే సమయంలో 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురి అవడంతో ఒక్కసారిగా కృష్ణ రాజకీయ ప్రస్థానం అయోమయ పరిస్థితిలో పడిపోయింది.

ఇలా రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో మద్యంతర ఎన్నికలు రావడం తిరిగి ఈయన పోటీ చేసిన ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా రాజీవ్ గాంధీ చనిపోవడంతో కృష్ణ ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఎన్నికలకు దూరమయ్యారు. ఒకవేళ రాజీవ్ గాంధీ బ్రతికి ఉండి ఉంటే కచ్చితంగా కృష్ణ తెలుగు రాష్ట్రంలో సీఎంగా ఉండేవారు అని తెలుస్తోంది. కానీ రాజీవ్ గాంధీ కారణంగానే తాను సీఎం అవ్వలేకపోయారు అని తెలుస్తోంది.

రాజీవ్ గాంధీని కొంతమంది కావాలనే హత్య చేసినట్లు ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . కానీ ఈ విషయంపై ఇంకా మిస్టరీ వీడలేదు. మరొకవైపు ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న రాజీవ్ గాంధీ మరణించడంతో కృష్ణ కావాలనే రాజకీయాలకు దూరం అయ్యాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *