ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు పేదరికం నుండి వచ్చిన వాళ్లే. ఆ పేదరికంలో ఉన్న చాలా మంది దాన్ని అధిగమించాలనే కసిపెరిగి ఏదైనా సాధించాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది స్టార్ హీరోలు,హీరోయిన్లు అయ్యారు. అయితే ఇలాంటి పేదరికంలో నుండి వచ్చి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది రష్మిక. ఈమె ఓ మామూలు హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం దేశం మొత్తం మెచ్చిన హీరోయిన్గా మారిపోయింది. అయితే చిన్నతనంలో రష్మిక కుటుంబం చాలా దుర్భరమైన పరిస్థితులను అనుభవించిందట.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. నా చిన్నప్పటినుండే మా ఫ్యామిలీ మొత్తం చాలా పేదరికంలో ఉండేది. మేము ఎన్నో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా తల్లిదండ్రులు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉండేవారు. ఇక నెల గడిచింది అంటే చాలు ఇంటి అద్ద కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. దాంతో ఆ ఇంటి యజమానులు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉండేవారు. మేము ప్రతి రెండు నెలలకు ఒకసారి కొత్త ఇల్లు వెతుక్కోవడం జరుగుతుండేది. ఒక్కొక్కసారి ఉండడానికి ఇల్లు వెతుక్కోవడం కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

అయితే అంత పేదరికంలో ఉన్నా కూడా మా తల్లిదండ్రులు నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. కానీ వాళ్ల పేదరికం అర్థం చేసుకొని నేను ఎలాంటి కోరికలు తీర్చమనే దాన్ని కాదు. ఎందుకంటే కనీసం వాళ్ళ దగ్గర ఒక బొమ్మ కొనివ్వమని అడిగినా కూడా డబ్బులు లేని పరిస్థితి. మేము అనుభవించే దుర్భరమైన పరిస్థితులన్నీ నా మైండ్ లో అలాగే ఉన్నాయి. అందుకే నాకు డబ్బు అంటే చాలా గౌరవం. నాకు ఈ సినీ కెరియర్ లో వచ్చిన సక్సెస్ ని,స్టార్ట్డమ్ ని,అభిమానులని అస్సలు ఈజీగా తీసుకోను.

ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ రేంజ్ కి వచ్చాను అంటూ రష్మిక ఆ ఇంటర్వ్యూ లో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అయితే ఉండడానికి కూడా ఇల్లు లేని రష్మికకు ప్రస్తుతం ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు, అలాగే బెంగళూరులో కూడా పెద్ద ఇల్లు,ఎన్నో కార్లు, భారీ ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం తన ఒక్కో సినిమాకి మూడు కోట్ల కు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.ఇక ఇప్పుడు ఉంటున్న రష్మిక జీవితానికి ఆమె చిన్నప్పుడు గడిపిన జీవితానికి ఏమాత్రం పొంతన లేదు. అలా తన స్వయంకృషితో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *