కృష్ణ తన మరదలైన ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నప్పటికీ విజయనిర్మల ను రెండో పెళ్లి చేసుకున్నాడు. దానికి కారణం వారి ఇష్ట ఇష్టాలు, అభిప్రాయాలు అన్ని ఒకటై దాంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరిద్దరికీ అప్పటికే పెళ్లయిపోయినా కూడా వీరి మధ్య ప్రేమ చిగురించి రెండో పెళ్లికి దారి తీసింది. ఇక వీరిద్దరి ప్రేమ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణ మంచి భోజనం ప్రియుడు. ఔట్ డోర్ షూటింగ్లోకి వెళ్ళినప్పుడు బయట భోజనం తినడానికి అంతగా ఇష్టపడేవాడు కాదు.

దాంతో విజయనిర్మల స్వయంగా దగ్గరుండి తన చేత్తో వంట చేసి తీసుకు వెళ్ళేది. ఇక అప్పట్లో ఇందిరా దేవి ఫ్యామిలీని చూసుకునే విషయంలో చాలా బిజీగా ఉండేది. దాంతో విజయనిర్మల కృష్ణకు దగ్గరుండి అన్ని పనులు చేసేది. ఇక ఇంటి ఫుడ్ అంటే కృష్ణ కి చాలా ఇష్టం. దీంతో అడిగిమరీ మటన్, చికెన్, చేపల పులుసు వంటి వంటకాలు ప్రత్యేకంగా విజయనిర్మలతో చేయించుకునేవారు. ఇక విజయనిర్మల కూడా కృష్ణ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త వహించేది. ఆయిల్ ఫుడ్, వేపుళ్ళు వంటివి పెట్టకుండా జాగ్రత్త పడేదట.

అయితే విజయనిర్మల భోజనం అంత ఇష్టంగా తిన్నా కూడా కృష్ణకు ఏ మాత్రం ఒళ్ళు రాలేదు. ఇక వీరి మధ్య ఉన్న ఫుడ్ సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లయ్యాక కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇక రెండో పెళ్లి చేసుకునే విషయంలో ఇందిరా దేవిని కృష్ణ ఒప్పించడంతో గొడవ మొత్తం సద్దుమణిగింది. పెళ్లయ్యాక విజయ్ నిర్మల తన అత్తమామలను ఎంతో బాధ్యతగా చూసుకునేదట. అందుకే వీరి మధ్య దాంపత్య బంధం ఎంతో అన్యోన్యంగా ఉండేది.

అయితే అప్పట్లో కృష్ణ ఓ స్టార్ హీరోయిన్ తో సన్నిహితంగా ఉండడంవల్ల వారిద్దరి మధ్య బంధం ఎక్కడ పెరుగుతుందోనని విజయనిర్మల చాలా భయపడేదట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. జయప్రద కృష్ణ కలిసి దాదాపు 45 సినిమాల్లో నటించారు. ఇక వీరు అన్ని సినిమాల్లో కలిసి నటించడం వల్ల వీరిమధ్య కాస్త క్లోజ్ లెస్ ఉండేది. అయితే అది గమనించిన విజయనిర్మల ఎక్కడ ఆ బంధం ప్రేమగా మారుతుందోననే భయంతో వారి మీద ఓ కన్నేసి ఉంచేదట. ఇక ఆ కారణం వల్లే విజయనిర్మలకు, జయప్రదకు మధ్య కోల్డ్ వార్ జరిగింది అని అప్పట్లో ఓ టాక్ నడిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *