టాలీవుడ్ లో రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఈయన ఈ మధ్యనే లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఖుషి సినిమా లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఫేస్ హాస్పిటల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే విజయ్ దేవరకొండ ఆ కార్యక్రమంలో మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ఆ కార్యక్రమంలో ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నాకు ఫేస్ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లతో మంచి అనుబంధం ఉంది. నాకు కష్ట కాలంలో వాళ్ళు తోడుగా నిలిచారు. ఎందుకంటే..నేను ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా చేస్తున్న టైంలో మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. ఆ టైంలో నేను ఫేస్ హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించగా వెంటనే వారు స్పందించి మా నాన్నగారికి ట్రీట్మెంట్ అందించారు. మా నాన్న ఇప్పుడు ఇలా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ హాస్పిటల్ డాక్టర్లే. అందుకే ఈ హాస్పిటల్ వాళ్లు ఆహ్వానించగానే నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. అయితే ఈ హాస్పిటల్ లోని డాక్టర్లతో మాట్లాడుతూ అవయవ దానం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాను.

ఇలా అవయవ దానాలు చేస్తే మనం లేకపోయినా మన అవయవాలు వేరే వారికి ఉపయోగపడి మన అవయవాల వల్ల వారికి మనం కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం.ఇక ఆర్గాన్ డొనేట్ చేసే వాళ్ళను చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందువల్లనే నేను కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాను.అదేంటంటే.. నేను కూడా నా అవయవాలన్నీ దానం చేసేస్తాను. నా తర్వాత కూడా నా అవయవాల వల్ల వేరే వ్యక్తి జీవితం నిలబడడం వల్ల వారి రూపంలో నేను ఇంకా బతికే ఉంటాను. ఇక ఈ విషయం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అంటూ ఓ సంచలన నిర్ణయాన్ని చాలా సున్నితంగా తీసుకున్నారు విజయ్ దేవరకొండ.

 ఇక విజయ్ దేవరకొండ మంచితనం చూసిన చాలామంది మీరు నిజంగా గ్రేట్ అన్నా హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఏదో ఒక విధంగా ఆయన మంచితనాన్ని నలుగురికి పంచుతూ వస్తున్నారు. అంతేకాదు కరోనా టైం లో కూడా చాలామంది యూత్ కి ఈ రౌడీ హీరో అండగా నిలిచారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఇలాంటి సెన్సేషనల్ డెసిషన్ తీసుకొని మరొకసారి తన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు అంటూ చాలామంది ఆయన అభిమానులు, నెటిజెన్లు విజయ్ దేవరకొండ గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *