సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అప్డేట్ అవుతున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయాన్ని ఒక్కొక్కరిగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం చాలామంది తమను వాడుకునే ప్రయత్నం చేశారు అని, లైంగిక ఇబ్బందులకు గురి చేశారు అని పలు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడిస్తూ కొత్త వాళ్లకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే జాగ్రత్తలు కూడా చెబుతూ ఉండడం గమనార్హం. మరి తాజాగా మరొక ప్రముఖ హీరోయిన్ కూడా ఈరోజు లైంగిక వేధింపులపై మొదటిసారి నోరు విప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా జెర్మయ్యా.. ఆండ్రియా సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె అనల్ మేలే పలితులి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆండ్రియా కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన చేదు సంఘటన గురించి వెల్లడించింది.

27+ Top Photos of Andrea Jeremiah - Irama Galleryచిన్నప్పుడు నేను నా కుటుంబంతో కలిసి వేలాంగణిమాతకు బస్సులో ప్రయాణం చేస్తున్నాము. అయితే బస్సు ప్రయాణంలో నా తండ్రి పక్కన కూర్చొని వెళ్తుండగా ఒక్కసారిగా ఒక వ్యక్తి నా టీ షర్టు వెనుక వైపు నుంచి తన చేతిని లోపల పెట్టాడు. అయితే ఆ చేయి నా తండ్రిది అనుకున్నాను. కానీ కొంతసేపటికి తన చేయి మరింత లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా నేను తన తండ్రి వంక చూడగా.. ఆయన రెండు చేతులు బయటే ఉన్నాయి.. ఆ విధంగా నా టీ షర్టులో చెయ్యి పెట్టింది నా తండ్రి కాదని వెనకాల వ్యక్తని తెలుసుకొని వెంటనే అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోయాను అని తెలిపింది.

అయితే ఈ విషయాన్ని నేను నా తండ్రికి చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయానో అని ఎన్నోసార్లు ఆలోచించాను. బహుశా మనం పుట్టి పెరిగిన సమాజంలోని కట్టుబాట్లు దృష్టిలో పెట్టుకొని నేను చెప్పలేకపోయానేమో అని అనిపిస్తోంది అంటూ ఆండ్రియా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *