టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలకు, ఆయన కథలకు ఫిదా అవ్వని వారుండరు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు..

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతగానే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాలో చేయాలనీ తెగ కోరుకుంటారు. ఆయన మీద నమ్మకం అలాంటింది. అయితే అలా నమ్మినందుకు తనను మోసం చేశాడని హీరోయిన్ ప్రేమ చెప్పడం షాకింగ్ కు గురిచేస్తోంది. ధర్మ చక్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రేమ, దేవి సినిమాతో స్టార్ హీరోయిన్ గా అయితే మారింది.

ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు కూడా అందుకుంటున్న సమయంలో ఆమెకు త్రివిక్రమ్ కథను అందిస్తున్న చిరునవ్వుతో సినిమా అవకాశం అయితే వచ్చింది. అయితే అందులో బావతో పెళ్లి వద్దనుకుని ఒక మోసగాడిని పెళ్లి చేసుకొని మోసపోయి ఇంటికి వచ్చే అమ్మాయి పాత్ర. ఆ పాత్ర చేయడానికి ప్రేమ సంకోచించిందట. “నేను అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్నాను. మొదట త్రివిక్రమ్ ఈ సినిమాలో నాది హీరోయిన్ పాత్రనే అని అయితే చెప్పారు.

కానీ, ఇంకో హీరోయిన్ కూడా ఉందని అడుగగా.. నీది కూడా హీరోయిన్ రేంజ్ పాత్రే అని చెప్పి త్రివిక్రమ్ నన్ను ఒప్పించాడని కథ మొత్తం నా మీదే తిరుగుతుందని చెప్పడంతో త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమా చేశాను. సినిమా రిలీజ్ అయ్యాకా నాదంతా సహాయనటి పాత్రగా మారిపోయింది. షూటింగ్ కి ముందు నాకు ఒకలా చెప్పి.. ఇంకోలా చిత్రీకరించి త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు త్రివిక్రమ్.ఇక ఈ సినిమా తరువాత నాకు అన్ని కూడా అలాంటి పాత్రలే వచ్చాయి. దీనివలన నా కెరీర్ అయితే పోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *