మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా పెళ్లంటూ రెండు రోజుల నుండి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ బడా బిజినెస్ మాన్ తో తమన్నా పెళ్లికి రెడీ అయిందని, వీరి పెళ్లి పెద్దలు కుదిరిచింది అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుంటారు.. ఆ తర్వాత త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం తమన్న పెళ్లి చేసుకోబోయే ఆ బడా బిజినెస్ మాన్ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. తమన్నా పెళ్లి చేసుకోబోయే ఆ బిజినెస్ మాన్ కి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయట. అంతేకాదు ముంబైలోనే ఆయన టాప్ బిజినెస్ మాన్ గా కొనసాగుతున్నాడట.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నా కూడా అతనికి ఓ వింత జబ్బు ఉందట. ఆ జబ్బు ఏంటంటే ఆ వ్యక్తి ఏదైనా అతని శరీరానికి పడని ఆహారం తింటే వెంటనే అతని బాడీలో రియాక్షన్ జరిగి స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయట. అయితే ర్యాషెసా కదా అని వదిలేస్తే అవి ప్రాణానికే ప్రమాదం అవుతుందట. ఇక ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్న ఆ బిజినెస్ మ్యాన్ ని తమన్నా పెళ్లి చేసుకోవడం ఏంటి?అంటూ చాలామంది నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అంతేకాదు డబ్బు కోసమే తమన్నా అలాంటి వ్యాధి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ విషయంలో ఇంత నిజముందో తెలియాలంటే కచ్చితంగా తమన్నా క్లారిటీ ఇవ్వాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *