రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సుజిత్ ఆ తరువాత సినిమాను ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో చేస్తాడని ఎవరూ కూడా ఊహించలేదు. ఆ విధంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి సినిమా చేసిన సుజిత్ అనుహ్యమైన ఫలితాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు.

ఆ తర్వాత ఆయన సినిమా చేయడానికి ఇప్పటికి నోచుకోలేదు అంటే ఆ సినిమా యొక్క ప్రభావం ఆయన పై ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా పరంగా టెక్నికల్ గా అన్ని విధాలుగా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో సుజిత్ ను నమ్మడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు.

ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా ఓ తమిళ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు అనే వార్తలు మొన్నటిదాకా వినిపించాయి. అయితే ఆయన బ్యాడ్ లక్ ఇంకా తొలగిపోలేదు అనుకుంటా.. తాజాగా పవన్ కళ్యాన్ తాను చేయబోయే తదుపరి సినిమాలను క్యాన్సల్ చేసుకోవడంతో ఈ సినిమా కూడా అందులో ఉండడంతో సుజిత్ ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నారని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి. అంతకుముందు చిరంజీవితో కలిసి చేయవలసిన గాడ్ ఫాదర్ సినిమాను ఆయన మధ్యలోనే వదిలేసి వెళ్లగా ఫైనల్ గా మోహన్ రాజా ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆ సినిమా ఫలితం కూడా నెగిటివ్ గానే రావడం జరిగింది. అలా మరో ఫ్లాప్ నుంచి సుజిత్ తప్పించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *