స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని ఫాన్స్ ఫిక్స్ అవుతారు. తారక్ రాజమౌళి బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో సంచలనాలు సృష్టించడంతో పాటు ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా వేర్వేరు జానర్ లలో తెరకెక్కడం విశేషం . అయితే తాజాగా రాజమౌళి తారక్ ను ఎప్పుడు చూసినా ఆశ్చర్యపోతుంటానని వెల్లడించారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అని రాజమౌళి పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ సమయం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని జక్కన్న వెల్లడించారట.. అయినప్పటికీ తారక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించారని జక్కన్న పేర్కొన్నారు. తారక్ 12 గంటలు షూట్ లో పాల్గొని ఆ తర్వాత కూడా రూమ్ కు వెళ్లి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారని రాజమౌళి వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా చేయడంతో తారక్ పై నాకు అమితమైన గౌరవం పెరిగిందని రాజమౌళి కామెంట్లు కూడా చేశారు.

తారక్ పై జక్కన్న అభిమానం చాటుకున్న విధానానికి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ దిశగా అడుగులు పడుతుండగా ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ రావాలంటే చరణ్, తారక్ మరో మూడేళ్ల సమయం అయితే కేటాయించాల్సి ఉంటుంది. చరణ్, తారక్ ఫ్యాన్స్ ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ గురించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్30 రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుండగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఎన్టీఆర్30 తారక్ కెరీర్ లో మెమరబుల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్స్ తన రేంజ్ ను మరింత పెంచాలని తారక్ కూడా అనుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *