టాలీవుడ్ దివంగతనేత సినీనటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి ఈరోజు కాసేపటికి క్రితం అంత్యక్రియలు జరిగాయి. దాన్ని సోషల్ మీడియా లో చూసిన రమణమూర్తి గారు కృష్ణ గారికి మంగళగిరితో ఉన్న అనుబంధం ఒకసారి గుర్తుచేసుకున్నారు.కృష్ణ తన చిన్నతనం నుంచే మంగళగిరిలో కొలువైన్న లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లకు ప్రతి సంవత్సరం తన స్నేహితులతో కలసి వచ్చి అక్కడే సరదాగా గడిపేవారు.

ఆ టైములో నృసింహుని ఆలయం పక్కనే ఉన్న నివాసం వద్ద ఇంటి ముందు అరుగులపై కృష్ణ మరియు అతని ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా గడిపేవాడని అక్కడే నిద్రించేవాడని రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాల్లో నటించడం ప్రారంభమైన తరువాత కూడా మంగళగిరిని మర్చిపోకుండా తన మూవీస్ లో నాలుగుఐదు చిత్రాలకు సంబంధించి షూటింగ్‌ కూడా మంగళగిరిలో నిర్వహించారు.

ఆయన మంగళగిరి లో చేసిన సినిమాల్లో ముఖ్యంగా సావాసగాళ్లు, పట్నవాసం, పల్నాటి సింహం, రక్త తర్పణం మూవీస్ మంగళగిరి కేంద్రంగా చాలా రోజులు జరిగింది. అక్కడ ఆలయ ఆవరణలో సావాసగాళ్లు, పల్నాటి సింహం మూవీ లకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరిగింది. ఐతే అప్పట్లోనే కృష్ణ గారికి మంగళగిరికి చెందిన వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. మరియు ఆయనకు అక్కడ కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పేరు మీద అనేక సేవా సంఘం పేరు మీద అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మరీ ముఖ్య విషయం ఏంటంటే ఆయన బట్టలు మంగళగిరికి చెందిన ఫేవరెట్‌ టైలర్‌ మహ్మద్‌అలీ కుట్టి అందించేవారు. ఐతే కృష్ణ గారి మృతి వార్త విన్న వెంటనే ఆయన యొక్క మంగళగిరి అభిమానులు మరియు అక్కడ తెల్సిన వాళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు అని రమణమూర్తి గారు చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *