టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.ఐతే ఈ టైం లోనే కొందరు సూపర్ స్టార్ కృష్ణ మృతికి, రీసెంట్ గా జరిగిన ఆయన సతీమణి ఇందిరా దేవి మృతికి అలాగే అంతకు ముందు జరిగిన ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతికి రీసన్ వారి ఇంట్లో పవిత్ర లోకేష్ కాలు పెట్టడమే అంటూ కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు సృష్టిస్తున్నారు.

మాములుగా ఐతే ఆమెకు మరియు కృష్ణ ఫ్యామిలీ కి అసలు సంబంధం లేదు. ఐతే వాళ్ళు చెప్తున్న లాజిక్ ప్రకారం గత సంవత్సరం చివర్లో కృష్ణ ఫ్యామిలీకి చెందిన నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తుంది. అప్పట్లో అది బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆమె వచ్చినప్పటి నుండి కృష్ణ ఫ్యామిలీలో వరుసగా ఏదో ఒక చెడు జరుగుతూ వస్తుందని ఆమె వల్లే ఇదంతా జరుగుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.కానీ అసలు నరేష్ కి సూపర్ స్టార్ కృష్ణ కి రక్త సంబంధం అయితే లేదు.

నరేష్ తల్లి విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం అందరికి తెలిసిందే. ఐతే దానికి మించి ఎక్కువ రిలేషన్ అయితే లేదు, అయినా కూడా పవిత్ర లోకేష్ ఆ ఫ్యామిలీ లో అడుగు పెట్టిన వెంటనే ఇవన్నీ జరుగుతున్నాయి అనడం చాలా విడ్డూరమని ఇలాంటి పిచ్చి పిచ్చి పుకార్లు పుట్టించి కొందరు తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరి కాదంటూ సోషల్ మీడియా లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *