టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు కాసేపటికి క్రితం ముగిసాయి.దీన్ని బట్టి కొంతమంది విశ్లేషకులు చెప్పేదేంటంటే ఈరోజుతో ఆనాటి ఒక జనరేషన్ తరం ముగిసింది. మాములుగా టాలీవుడ్ అనగానే గుర్తుకు వచ్చే స్టార్స్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు అని అందరు అంటుంటారు.

ఈరోజుతో ఈ ఐదుగురు తారలు కూడా ఆకాశంలో ధృవ తారలుగా మిగిలారు. ఐతే ఈరోజు కృష్ణగారి పార్థివదేహానికి కడసారి వీడ్కోలు పలకడానికి టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. మెగాస్టార్ మొదలుకొని కుర్ర హీరోలు విజయ్ దేవరకొండ వరకు ప్రతి ఒక్కరు కృష్ణ గారికి నివాళులు అర్పించి మహేష్ బాబును ఓదార్చారు. అయితే కృష్ణగారి పార్థివదేహాన్ని చూడని ఏకైక హీరో నాగార్జున. గత రెండు రోజులుగా ఆయన ఎక్కడా కనిపించలేదంటుఆయన అభిమానులు నాగ్ ఎక్కడ అంటూ ఆరా తీస్తున్నారు.

ఐతే కృష్ణ కుటుంబానికి, అక్కినేని గారి కుటుంబానికి సత్సంబంధాలు మొదటి నుండి బాగానే ఉన్నాయి, కృష్ణతో కలిసి నాగ్ వారసుడు అనే మూవీ కూడా తీశాడు ఆ మూవీ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెల్సు. ఇక కృష్ణతో ఎంత ప్రేమతో ఉండేవాడో నాగ్ మహేష్ తో కూడా అంతే ప్రేమగా ఉండేవాడు. అలాంటి నాగ్, కృష్ణ గారి మరణవార్త విన్న వెంటనే ట్వీట్ మాత్రం చేశారు కానీ, ఎందుకు కృష్ణ గారిని చూడడానికి రాలేదు అనే అనుమానాలు ఆయన అభిమానులకు మరియు నేటిజన్లకు వ్యక్తమవుతున్నాయి.

ఐతే నాగ్ వారసులు ఐనా అఖిల్, నాగ చైతన్య మాత్రమే కృష్ణ పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారు. ఒకవేళ నాగ్ సినిమా షూటింగ్ ల పరంగా రాలేకపోవడని కి ఆయనకు ప్రెజెంట్ ఆయన చేతిలో మూవీస్ ఏమి లేవని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.మరి నాగ్, ఎందుకు కృష్ణ అంత్యక్రియలకు రాలేదని అందరు ఆరా తీస్తున్నారు. మరి దీనికి సంబంధించి నాగ్ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.దీనికి సంబంధిచిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని సోషలమీడియా అభిమానులు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *