సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాల్లో ఒకటైన ‘సింహాసనం ‘ లో ఉన్న ఒక సాంగ్ ‘ఆకాశంలో ఒక తార..నాకోసం వచ్చింది ఈ వేళ’ అంటూ తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఆ ధృవ తార ఇప్పుడు లేదు అంటే నమ్మ సక్యం గా లేదు.టాలీవుడ్ చలన చిత్ర హిస్టరీ లో బాగా ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ పేరపొందారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ అభిమానులు ఉన్న వ్యక్తి కృష్ణ గారు.

కృష్ణకు 2500 వరకు అభిమాన సంఘాలు ఉండేవంటే ఐతే అపుడు ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో అర్థం అవుతుంది.ఆయన అభిమాన సంఘాలు ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడు లో కూడా ఉండేవి. ఆయన తర్వాత దశలో కృష్ణ అభిమాన సంఘాలు,మరియు మహేష్ అభిమాన సంఘాలు కలిసిపోయి 2008లో సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఫామ్ అయ్యాయి.

ఇక్కడ ముఖ్యం గా చెప్పుకునే ఇంకో విశేషం ఏమిటంటే కృష్ణకు సెలబ్రిటీలు కూడా పెద్ద ఫ్యాన్స్‌ గా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.చిరంజీవి యువకుడిగా ఉన్న టైం లో సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిగా ఉండేవారు.

పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు చిరంజీవి గారు.ఇపుడు ప్రెజెంట్ ‘తోడు దొంగలు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ అభిమాన సంఘం పేరిట రిలీజ్ చేసిన కరపత్రం ఇపుడు బాగా వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *