సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం రోజు తెల్లవారుజామున మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఈయన మరణంతో ఒక్కసారిగా ఘట్టమనేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక చాలామంది రాజకీయ నాయకులు,హీరోలు, హీరోయిన్లు, అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు ఆయనను చివరిసారి చూడ్డానికి ఆయన ఇంటికి తరలి వచ్చారు.

ఇక కృష్ణ మరణించినప్పటి నుండి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే అలాంటి విషయమే ఇప్పుడు మనం ఒకటి తెలుసుకుందాం. మహేష్ బాబు నమ్రత ను ఎంతో ప్రేమించి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నారు. అయితే నమ్రత ని పెళ్లి చేసుకోవడం కృష్ణకి అస్సలు ఇష్టం లేదట. కానీ కృష్ణ నిర్ణయం కాదని ఆయనను ఎలా గొలా ఒప్పించి మహేష్ బాబు, నమ్రత ను పెళ్లి చేసుకున్నాడు.

ఇక నమ్రత ని ఇంటి కోడలుగా మొదట్లో వద్దని చెప్పిన కృష్ణ ఆ తర్వాత నా కోడలు బంగారం అంటూ అనేవారట. అయితే స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా తన ఫ్యామిలీ కోసం తన సినీ కెరీర్నే వదులుకొని కేవలం ఇంటికే పరిమితమైన నమ్రతను చూసి కృష్ణ చాలా ఇష్టపడ్డారట. అంతేకాదు నా కోడలు బంగారం లాంటి వ్యక్తి మా ఇంటి బాధ్యతలు అన్ని చక్కగా నెరవేరుస్తుంది అంటూ ఆయన తన సన్నిహితులతో చెప్పుకునే వారట. అలాగే తన కూతుర్లకు చెప్పలేని విషయాలను కూడా కృష్ణ నమ్రతతో చెప్పుకొని తన మనసులోని బాధ పోగొట్టుకునే వారట.

ఇక ఒకానొక సందర్భంలో నువ్వు నా కోడలివి కాదమ్మా నా కూతురివి.. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను వద్దన్నాను నన్ను క్షమించమ్మా.. అంటూ నమ్రతని కృష్ణ అడిగారట. నీలాంటి వ్యక్తిని అసలు నా కొడుక్కి నేను ఈ జన్మలో కూడా భార్య గా తీసుకొచ్చేదాన్ని కాదు అంటూ ఎమోషనల్ అయ్యారట. ఇక ప్రస్తుతం కృష్ణ మాట్లాడిన ఆ మాటలను తలుచుకొని నమ్రత చాలా ఎమోషనల్ అయిందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *