సినిమా రంగంలో పెద్ద హీరో అయినా సరే.. చిన్న సక్సెస్ లో ఉన్న హీరోకి ఇచ్చే గౌరవం ఫెయిల్యూర్ లో ఉన్న పెద్ద హీరోకి ఇవ్వరన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోలు సైతం ఇందుకు అతీతులు కాదు. అలా 1974లో వరుస ప్లాప్ ల వల్ల కృష్ణ కెరియర్ కు పూర్తిస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భిన్నమైన కథలను ఎంచుకున్నా సరే కాలం కలిసి రాక అపజయాలు ఎదుర్కోక తప్పలేదు. కొంతమంది ఏకంగా కృష్ణ హీరోగా సినిమాలు ఆపేయడం మంచిదని నెగిటివ్ కామెంట్లు, సలహాలు కూడా ఇచ్చారు. కొందరు నిర్మాతలు అయితే కృష్ణకు కనపడకుండా తప్పించుకొని మరీ తిరిగారు.

Veteran Telugu actor Krishna passes away - The Hindu
వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ అవడంతో కృష్ణ తో సినిమాలను తెరకెక్కించాలంటే దర్శక నిర్మాతలు సైతం ఇబ్బంది పడేవారు. అయితే పాడిపంటలు సినిమాతో వరుస ఫ్లాప్ లకు బ్రేకులు వేసి కృష్ణ సక్సెస్ అందుకున్నారు. ముఖ్యంగా కృష్ణ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత దర్శక నిర్మాతలు సైతం ఆయనతో కలిసి పనిచేయడానికి క్యూ కట్టారు. అయితే జరిగిన ఘటనలతో ఎవరు ఎలాంటి వ్యక్తులో అర్ధమైన కృష్ణ కష్టాల్లో తనకు అండగా నిలిచిన వాళ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అలా సినిమాలు ప్లాప్ అవడంతో తప్పించుకొని తిరుగుతూ ఆయనను చాలా ఘోరంగా అవమానించారు నిర్మాతలు.

ఇకపోతే మహేష్ బాబు కొడుకు తన మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించాలని కృష్ణ ఆశపడ్డాడు.. కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఇక మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడాలని భావించినా ఆ ఆశ కూడా తీరలేదు. చత్రపతి శివాజీ పాత్రలో నటించాలని ఉంది అని కృష్ణ చెప్పినా కూడా ఆ కోరిక కూడా నెరవేరలేదు. అంతేకాదు తెలుగులో కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షో చేయాలని కృష్ణ భావించినప్పటికీ.. ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆ షో కి ఆయనను పిలవలేకపోయారు. ఇలా ఎన్నో తీరని కోరికల మధ్య తండ్రి మరణించడం చూసి మహేష్ బాబుకు కన్నీళ్లు ఆగడం లేదు.

మహేష్ బాబు ని చూసి అభిమానుల సైతం విలవిల్లాడిపోతున్నారు పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *