టాలీవుడ్ సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి హైద్రాబాద్ తో నలభై సంవత్సరాల కుపైగా అనుబంధం ఉంది.ఆయన మన నుండి పర్మినెంట్ గా దూరం ఐనా ఇక్కడి గడ్డపై ఆయన యొక్క జ్ఞాపకాలు మనతో పాటు సజీవంగా ఉంటాయని ఆయన ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు హైద్రాబాద్ తో ఉన్న అనుసంధానంలో భాగంగా అక్కడ ఆయనకు చెమట పట్టని వాతావరణమూ, ఇక్కడ దొరికే పచ్చ అరటిపండ్లు మరియు మంజీరా నీళ్లన్నా ఆయనకు చాలా ఇష్టమట.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో స్థిరపడటానికి ముఖ్యమైన మూడు మూల స్తంభాల్లో కృష్ణ గారు ఒకరు. ఆయన తన పద్మాలయ స్టూడియో నిర్మాణం కంప్లీట్ ఐనా తర్వాత ఎక్కువ భాగం సినిమా షూటింగ్‌లుఇక్కడే చేసేవారట.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ రావడానికి డెబ్బయ్ వ దశకం చివర,యెనభై వ దశకం స్టార్టింగ్ లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిల్మ్‌నగర్‌లో దాదాపు నూటయాభై ఎకరాలు ఇచ్చింది.గవర్నమెంట్ ప్రోత్సాహం తో , స్వరాష్ట్రంలోనే తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో అల నాటి అగ్రహీరోలు ఐనా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, ఇతర ప్రముఖులు డెబ్బాయ్ వ దశకం ఆఖర్లో హైదరాబాద్‌ వచ్చేశారు. కృష్ణ గారు అప్పట్లో రామానాయుడు స్టూడియోస్‌కు వెళ్లే దారిలో ఇల్లు కట్టుకున్నారు.

ఆయన తన స్టూడియోని ఫిల్మ్‌నగర్‌లో పద్మాలయ స్టూడియోస్‌ పేరిట నిర్మించారు.కృష్ణ గారు ఒకసారి ముఖాముఖీ సంభాషణలో భాగంగా మద్రాస్‌లో సముద్రం ఉండటంతో ఎక్కువగా చెమటపట్టేది. హైదరాబాద్‌లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది అని అన్నారని అభిమానులు గుర్తు చేసుకున్నారు.

దీన్నిబట్టి తెల్సింది ఏంటంటే హైద్రాబాద్ లో కృష్ణ గారికి బాగా నచ్చిన వాటిల్లో హైద్రాబాద్ వాతావరణం,అక్కడ దొరికే పెద్ద పచ్చ అరటిపండ్లు, అలాగే నగరానికి సరఫరా చేసే మంజీరా నీళ్లు మరియు ఇక్కడ ఏడాది పొడవు దొరికే మొక్కజొన్న పొత్తులు అంటే ఆయనకి ఎంతో ఇష్టమని ఆయనే స్వయానా ఒకానొక టైం లో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *