టాలీవుడ్ ఇండస్ట్రీ లో నవంబర్ 15,2022 అనేది ఒక బ్లాక్ డే గా గుర్తుండి పోయే రోజు. అది స్ఒక ధ్రువతార నెలకొరిగిన రోజు.నటశేఖరుడు,తెలుగు ఇండస్ట్రీ సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు నింగికేగిసిన రోజు. ఐతే ఆయనకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఐనా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు బుధవారం రోజు హైదరాబాద్‌కు రానున్నారు.

ఆయన ఉదయం తొమ్మిది గంటల టైం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్‌ లోని పద్మాలయా స్టూడియోస్‌కు వచ్చి కృష్ణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. తర్వాత కృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

కృష్ణ గారు శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురికాగా ఆయనను ప్రముఖ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. సోమవారం నాటికీ ఆయన పరిస్థితి విషమించగా మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు డాక్టర్స్ తెలిపారు.దానితో ఆయన అభిమానులు మరియుమొత్తం తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.

ఐతే ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారికి అంత్యక్రియలు జరగనున్నాయి.బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు పద్మాలయా స్టూడియోలో ఆయన పార్ధివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.కృష్ణ గారు ఇండస్ట్రీ కి చేసిన సేవలు మరువలేనివి ఆయన ఎంతో మంది నిర్మాతలకి రెమ్యూనరేషన్ కూడా తీస్కోకుండా ఫ్రీ గా సినిమాలు చేసి ఇచ్చిన సంగతి అక్కడ ఉన్నవాళ్లు గుర్తుచేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *