అవును..మీరు వింటున్నది నిజమే. కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడట.ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే తాను ఎంతో ప్రేమించిన హీరోయిన్ నిక్కి గల్రాని ని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఓ సినిమాలో నటిస్తున్న టైంలోనే ప్రేమలో పడి చాలా రోజులు వీరి ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా దాచారు.

ఇక ఆ తర్వాత సినీ లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇంట్లో వాళ్లని ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లిలో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. చాలామంది హీరో హీరోయిన్ల లాగా ఆది పినిశెట్టి తన పెళ్లి విషయంలో ఏ ఒక్క విషయాన్ని దాచి పెట్టలేదు. తన పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చెబుతూ వచ్చాడు.

ఇక వీరి పెళ్లి టైం లో బ్రైడల్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అయింది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఉంటూనే టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో విలన్ గా నటించారు ఆది పినిశెట్టి.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే నిక్కి గల్రాని, ఆది పినిశెట్టి ఇద్దరు పెళ్లయ్యాక హనీమున్ కి ఎన్నో దేశాలు తిరిగివచ్చారు.

ఇక ఈ నేపథ్యంలోనే చాలామంది కుటుంబ సభ్యులు, అభిమానులు వీళ్లు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు చెబుతారా అని వేచి చూస్తున్నారు. ఇక తాజాగా ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *