పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లోపు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. 2024 ఎన్నికల లోపు ఈ సినిమా మినహా పవన్ మరో ప్రాజెక్ట్ లో కనిపించే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.. హరిహర వీరమల్లు ఇప్పటికే 50 శాతం షూట్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం మిగతా సన్నివేశాల షూట్ అయితే జరుగుతోంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. అటు పవన్ ఇటు క్రిష్ సినీ కెరీర్ లో ఈ సీన్ బెస్ట్ ఇంటర్వెల్ సీన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిధి అగర్వాల్కూడా , నర్గీస్ ఫక్రి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ నుంచి స్పష్టత అయితే లేదు.

ఈ సినిమా షూట్ పూర్తైన తర్వాతే రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమా విషయంలో క్రిష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రమే తన సినీ కెరీర్ కు మేలు జరుగుతుందని క్రిష్ కూడా భావిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాతగా కళ్లు చెదిరే బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పాన్ ఇండియా సినిమా అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. బడ్జెట్ భారం పెరుగుతున్నా నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని సమాచారం.ఈ సినిమా హీరోగా తన స్థాయిని పెంచడంతో పాటు అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని పవన్ భావిస్తున్నారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *