ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు అయితే విడుదల అవుతూనే ఉంటాయి. గతకొన్నేళ్లుగా ఎప్పుడు సంక్రాంతి బరిలో పోటీ పడని చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు కూడా ఈసారి పోటీ పడుతున్నారట.

ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం కూడా ప్రకటించడం జరిగింది.

ఇక ఇదే నిర్మాణ సంస్థలో మరొక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం వీరసింహారెడ్డి చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. కీలకమైన పాత్రల వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నది. దీంతో చిరంజీవి,బాలయ్య మరొకసారి సంక్రాంతి బరిలో పోటీకి దిగిబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడదగ్గ విషయం ఏమిటంటే ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులను మైత్రి మూవీ వారి నిర్మిస్తూ ఉన్నారు.

అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడడం అటు మెగా అభిమానులు అలాగే నందమూరి అభిమానులు ఇష్టం లేకపోయినా విడుదల కావాల్సిందే అంటే పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల ను ప్రతి ఏరియాలోను ఒకే డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చిరంజీవి సినిమాకి కండిషన్ పెడుతున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాలో రెండు చిత్రాల రైట్స్ను రూ.35 కోట్ల రూపాయలు కాగా.. సిడెడ్ వచ్చేసరికి రూ.24 కోట్ల రూపాయలు జరుగుతోందని తెలుస్తోంది.అయితే ఈ విషయంపై అక్కడ డిస్ట్రిబ్యూటర్లు చిరు సినిమాకు కండిషన్లు కూడా పెడుతున్నట్లుగా సమాచారం. దీంతో చిరంజీవి సినిమాకు తక్కువ రేట్లు అడుగుతున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా గాడ్ ఫాదర్ సినిమా పీడెడ్ లో రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. అందుచేతనే ఇలా డిమాండ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *