టాలీవుడ్ స్టార్స్ హీరోస్ లో వినోదాత్మక చిత్రాలు చేయడంలో విక్టరీ వెంకటేష్ కి మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు . స్టార్ హీరోగా ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయన తనదైన స్టైల్లో కామెడీ పంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని తన నవ్వులతో అలరిస్తాడు మరియు అందరి దృష్టిని ఆకర్షించారు.

ఐతే మూవీలలో యాక్షన్ సీన్స్లో రౌడీ ల దుమ్ము దులిపేసే వెంకటేష్ తన వ్యక్తిగత లైఫ్ లో మాత్రం చాలా శాతం ఆధ్యాత్మికంగా ఉంటారని తెల్సింది. ఆయనే స్వయంగా దేవతలపై నమ్మకం కంటే ఆధ్యాత్మికత వల్ల వచ్చే జ్ఞానాన్ని పొందాలని వెంకీచాలా సిట్యువేషన్స్ లో చెప్పుకొచ్చారు. ఐతే తాజాగా వెంకటేష్ ప్రెజెంట్ మూవీస్ ల నుండి కొంత కాలం విరామం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని విశ్వాసనియా వర్గాల సమాచారం. ఐతే అసలు ఇండస్ట్రీ కి దూరంగా పోయి కొన్నాళ్ళ పాటు విదేశాలకు వెళ్లి అక్కడ రిలాక్స్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీని గురించి ఐతే వెంకటేష్ స్వయంగా ఎక్కడా చెప్పకపోయిన ఆయన మాత్రం సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు మాత్రం వార్తలు సోషలమీడియా వేదికగా తెగ వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే విశ్వక్ సేన్ మరియు మిథిలా పల్కర్ లు హీరో హీరోయిన్లుగా నటించిన “ఓరి దేవుడా” సినిమాలో కనిపించారు విక్టరీ వెంకటేష్. ఐతే ఈ మూవీలో కూడా వెంకీ ఆధ్యాత్మికత చూపే దేవుడిగా కనిపించారు. ఇటీవల తన మేనల్లుడు ఐనా రానా దగ్గుబాటితో కలిసి “రానా నాయుడు” అనేటటువంటి ఒక నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటిస్తున్నారు. ఇది ఇలా చేస్తూనే సల్మాన్ ఖాన్ “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” లో కూడా వెంకటేష్ గారు కీలక పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం.

ఇన్ని ప్రాజెక్ట్స్ చిన్నవా, పెద్దవా అని పక్కన పెడితే చేతి నిండా ఇన్ని మూవీస్ లేదా వెబ్ సిరీస్ లు పెట్టుకొని వెంకటేష్ గారు ఇండస్ట్రీ ని వదిలి పోతారంటే ఆయన అభిమానులుగా మాకు నమ్మసఖ్యం కాదు అని ఈ న్యూస్ ఫేక్ అని నేటిజన్లు మరియు ఆయన అభిమానులు కొట్టి పరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *