విశ్వనటుడు అయిన కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం “ఇండియన్ 2”. శంకర్ మరియు కమల్ కాంబోలో వచ్చిన ఐకానిక్ “ఇండియన్” మూవీకి ఇది సీక్వెల్ సినిమా .

భారీ అంచనాల నడుమ గతంలోనే ప్రారంభమైన ఈ చిత్రం అనుకోని కారణాల వల్ల మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయి, కొన్ని వారాల క్రితమే తిరిగి పునఃప్రారంభించబడింది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో RC 15 సినిమాను మధ్యలో వదిలేసి మరీ శంకర్ ఇండియన్ 2 షూటింగ్ ను చేస్తున్నాడు. మధ్యమధ్యలో RC 15 షూటింగ్ ను కూడా చేస్తున్నాడనుకోండి. ఐతే, RC 15 కన్నా ముందుగానే ఇండియన్ 2 షూటింగ్ ముగిసేలా కనిపిస్తుందట..

ఎందుకంటే, తాజా సమాచారం ప్రకారం, ఇండియన్ 2 సినిమాకు సంబంధించి ఇంకా 60-70 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *