టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే హిట్లుఫట్లు తో సంబంధం లేకుండా యమ స్పీడ్ మీద సినిమాలను చేసుకుంటూ పోయే స్టార్ నందమూరి నటసింహ బాలకృష్ణ ఒకరు. అరవై వయసులో కూడా ఎక్కడ తగ్గకుండా కుర్ర హీరోలకు సైతం పోటీ గా నిలబడే దమ్మున్న మాస్ స్టార్ ఎవరైనా ఉంటే అది బాలయ్య బాబే అని చెప్పాలి.గత ఏడాది రిలీజ్ ఐనా ‘అఖండ’ మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన అకౌంట్ లో వేసుకున్నారు. అప్పట్నుండి ఫుల్ జోష్‌తో బాలయ్య ప్రాజెక్టులను వరుసగా పెట్టుకుంటున్నారు.

ఇపుడు ప్రెజెంట్ ‘క్రాక్’ మూవీ డైరెక్టర్ ఐనా గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా వస్తున్నా ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఐతే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ యింది . ప్రెజెంట్ షూటింగ్ అనంతపురం ఏరియాలో జరుగుతుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి ఓ ఆసక్తికరమైన అంశం లీక్ అయింది.

జనరల్ గా బాలకృష్ణ మూవీ లో యాక్షన్ సీన్స్ లు ఎక్కువగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ‘వీరసింహారెడ్డి’ మూవీలో కూడా ఇదే హైలైట్ గా నిలవబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.దీంట్లో భాగంగానే ఈ మూవీ లో ఏకంగా 11 ఫైట్లు ఉంటాయని, వాటిని స్టన్ శివ ఆధ్వర్యంలో టీమ్ డిజైన్ చేసిందని తెలిసింది. ఈ మూవీ లోని ఫైట్ సీన్లే దాదాపు గంట వరకూ ఉంటాయని మేకర్స్ నుండి తెలుస్తుంది.దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇది నిజం ఐతే బాలయ్య బాబు ఫ్యాన్స్ ని థియేటర్స్ లో ఆపడం అసాధ్యం అని కూడా థియేటర్ యాజమాన్యాలు అనుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *