తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ గురించి ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖులు రాజకీయవేత్తలు కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు తాజాగా మెగా నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన తర్వాత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇక ఈ రోజున కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో అల్లు అరవింద్ కూడా ఒకరు పద్మాలయా స్టూడియోకి చేరుకున్న అల్లు అరవింద్ కృష్ణకు పుష్పాంజలి ఘటించిన తర్వాత తమ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కృష్ణ గురించి ఇలా మాట్లాడుతూ కృష్ణ నిర్మాతల హీరో అని తెలియజేయడం జరిగింది. నేను సినిమాలు తీయడానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కృష్ణ గారిని ఎక్కువగా గమనిస్తూనే ఉంటాను ఆయన చనిపోయాడని వార్త వినగానే ఆయన చేసిన గొప్ప విషయం తనకు గుర్తుకు వచ్చిందని తెలియజేశారు.

ఇక ఎంతోమంది నిర్మాతలకు ఆయన ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వకముందే సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు..అప్పుడు కృష్ణ వాళ్ళని పిలిచి మీరేదో కష్టాలలో ఉన్నారు కదా నన్ను ఏమైనా సహాయం చేయమంటారా అని అడిగి డబ్బులు ఇచ్చి మరి సినిమాలు విడుదల చేశారని తెలియజేశారు.ఆ నిర్మాతలు ఎవరో కూడా తనకు తెలుసు అని ఇప్పుడు వారి పేర్లు నేను చెప్పదలచుకోలేదని తెలియజేశారు నిర్మాత అల్లు అరవింద్. ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని కూడా తెలియజేయడం జరిగింది.

నిర్మాతల బాగోగులు కోరుకునే వ్యక్తి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అయితే ఎవరూ లేరు అది మన దురదృష్టం అని తెలియజేశారు. ఆయన నివాళికి కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులతో పాటు కొన్ని లక్షల మంది అభిమానులు రావడం ఇది ఒక విచిత్రమని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిగా తెలియజేశారు అల్లు అరవింద్. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *