జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫారియా అబ్దుల్లా వరుస సినిమా అవకాశాలను అందుకోలేకపోతుంది. ఒడ్డు పొడుగు తో అందరిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సంతోష్ శోభన్ హీరో గా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా లో నటించింది. అయితే ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో కలిసి ‘రావణాసుర’ మూవీలో నటిస్తోంది. దీనిపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఒక వేళా ఈ సినిమా తో ఆమెకు కలిసి రాకపోతే మాత్రం ఆమె కెరీర్ ఇబ్బంది గా మారుతుందని చెప్పొచ్చు.

అయితే తన హైట్ కూడా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. 5 ఫీట్ 6 ఇంచెస్ వున్న ఫరియా పక్కన నటించాలంటే యంగ్ హీరోలు హైట్ తక్కువగా కనిపించే ప్రమాదం వుందని ఫీలవుతున్నారట. ఆ కారణంగా ఫరియాకు అవకాశాలు రావడం లేదని ఇన్ సైడ్ టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *