ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలలో అతి తక్కువ సమయం లోనే క్రేజ్ సంపాదించిన హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఇటీవలే విడుదలైన సినిమాలు పరవాలేదు అనిపించుకున్న క్రేజ్ మాత్రం విజయ్ దేవరకొండకు తగ్గలేదని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సరికొత్త కథ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు కెరియర్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Sekhar Kammula - Vijay Devarakonda: A Telangana Love Story
తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం డైరెక్టర్ గౌతం తిన్ననూరీ, పరశురాం వంటి స్టార్ డైరెక్టర్లతో కథలు వింటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికె శివ నిర్మాణంలో ఖుషి సినిమాని మొదలుపెట్టారు విజయ్ దేవరకొండ. అయితే సమంత వల్ల ఈ సినిమా కాస్త షూటింగ్ ఆలస్యం అవుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఈ గ్యాప్ లో సినిమా కథలను వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ తర్వాత చిత్రం మాత్రం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమల గతంలో హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ ,లీడర్ తదితర చిత్రాలను తెరకెక్కించారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో విజయ్ దేవరకొండ సినీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ స్నేహంతోనే మరొకసారి డైరెక్టర్ శేఖర్ కమ్ములకు తన తదుపరి చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం పలు చర్చలు కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఒకవేళ నిజమే అయితే విజయ్ దేవరకొండ శేఖర్ కమల కెరియర్ లో ఒక మంచి హిట్ సాధిస్తుందని అభిమానులు సైతం చాలా నమ్మకంగా ఉన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇప్పుడు అదే డైరెక్టర్ తో హీరోగా సినిమా చేయొచ్చు ఉండడం గమనార్హం అని చెప్పవచ్చు. మరి ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *