త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూ షూటింగ్ ముందుకు సాగనివ్వడం లేదు. ఈ సినిమాను మొదలుపెట్టిన కొన్ని రోజులకే మహేష్ బాబు తల్లి మరణించడం జరిగింది. దాంతో కొన్ని రోజులు బ్రేక్ పడింది. మహేష్ బాబు విదేశాలకు ట్రిప్ వెళ్లడంతో ఈ సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడడం జరిగింది.

పోనీ తిరిగి వచ్చాక అయినా ఈ సినిమా యొక్క షూటింగ్ జరుగుతుందా అంటే ఇప్పుడు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడం ఒక్కసారిగా అందరిని కలచివేసింది. ఆయన మరణం ఈ సినిమాపై తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాలి. ఈ సంవత్సరం మహేష్ కుటుంబంలో మూడో వ్యక్తి చనిపోగా ఆయన మానసిక స్థితి ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇలాంటి పరిస్థితులలో  ఆయన ఈ సినిమాను ఎలా పూర్తి చేస్తాడో అన్న విషయం చుడాల్సి ఉంది. ఈ ఎఫెక్ట్ ఈ సినిమాపై ఎంతో పడుతుంది అని చెప్పాలి. ఇప్పటికే కథ విషయంలో సంతృప్తిగా లేని మహేష్ ఇప్పుడు ఈ సినిమాను ముందుకు వెళ్లే దిశగా ఆలోచిస్తాడా అనేది చూడాలి.

తొందరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉన్నా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ బాధ నుండి మహేష్ కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది కాబట్టి మహేష్ సినిమా వచ్చే నెలలోనే మొదలవుతుందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *