తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది యువ హీరోయిన్లు. కానీ వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉండడం వారిని అగ్ర హీరోయిన్ గా ఎదగకుండా చేస్తుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఆ తర్వాత చేసిన రెండు సినిమాలతో విజయాలు అందుకొని సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఈ మూడు సినిమాల తర్వాత ఆమెకు పెద్దగా విజయాలు దక్కలేదని చెప్పాలి. దాంతో ఈమె మళ్లీ హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందా అన్న అనుమానాలు ఆమె అభిమానులు కలుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న కూడా కృతి హీరోయిన్ గా ఎదిగేందుకు మరో రెండు మూడు సినిమాలు అయినా పడాలి.

ఒకవైపు నిధి అగర్వాల్ కూడా సక్సెస్ లేక హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోతుంది. ఆమె కెరియర్లో మంచి విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత మరొక సినిమాతో ఆమె విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఈమె కెరియర్ కూడా కొంత అయోమయంగానే ఉంది. అలా ఈ హీరోయిన్లు విజయాలు లేక అయోమయానికి గురవుతున్నారు.

 సీనియర్ హీరోయిన్లు ఎక్కువగా అగ్ర హీరోయిన్లుగా లేని నేపథ్యంలో త్వరగా ఆ స్థానాన్ని భర్తీ చేసి పెద్ద హీరోలతో సినిమా అవకాశాలను అందుకోవాలి కాబట్టి యువ హీరోయిన్లు తాము చేసే సినిమాలు విషయంలో ఆశతోసి ముందుకు వెళితే మంచిది అని ఆమె అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే పూజా హెగ్డే మరియు రష్మిక మందన మాత్రమే అగ్ర స్థానం లో ఉండగా ఇంకొక వైపు వేరే ఏ హీరోయిన్లు కూడా ఈ పోటీకి వచ్చే అవకాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *