మిల్కీ బ్యూటీ అయిన తమన్నా వయసు మూడు పదులు అయితే దాటేసింది. చాలా కాలంగా ఈమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదుగో తమన్నాకు పెళ్లి ఇదుగో తమన్నాకు పెళ్లి అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

ప్రతిసారి గాలి పుకార్ల వలె మిగిలిపోయాయి. సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో తమన్నాను ఈ మధ్య పెళ్లి ఎప్పుడనే ప్రశ్న అయితే వేధిస్తుంది. నాకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. దేనికైనా సమయం రావాలి. పెళ్లి కుదిరితే ముందు మీకే చెబుతానని మాట దాటేస్తూ వస్తుందట. తాజాగా మరోసారి తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త వరుడు అట. కుటుంబ సభ్యులకు అబ్బాయి గుణగణాలు, ప్రొఫైల్ నచ్చడంతో ఓకే చేశారని తెలుస్తుంది.. తమన్నా సైతం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో పెళ్ళికి భాజా మోగనుందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ మీడియాలో ప్రముఖంగా అయితే వినిపిస్తోంది. కాగా తమన్నా పెళ్లి పై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. లేదంటే తమన్నా నే స్పందించాలి.

తమన్నాతో పాటు టాలీవుడ్ లో స్టార్ గా వెలిగిన కాజల్ కూడా పెళ్లి చేసుకొని చక్కగా సెటిల్ అయ్యింది. పెళ్ళికి సమయం వృధా కాకుండా లాక్ డౌన్ లో చేసుకుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకావడంతో ఖర్చు ఆదా అయ్యింది. కాజల్ ఒక అబ్బాయిని కూడా కన్నారు. తమన్నా మాత్రం ఇంకా కెరీర్ అంటూ మాట దాటేస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *