మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్ని డబ్బులు కూడబెట్టిందో చివరి రోజుల్లో అన్ని డబ్బులను పొగొట్టుకుంది.ఈమె చివరి రోజుల్లోఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి తిండి కూడా లేని స్థితిలో చనిపోయిందట. ఇక సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు సావిత్రి గారి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సావిత్రికి కృష్ణుడు పాత్ర అంటే చాలా ఇష్టం.ఆపాత్రని ఆమె ఇష్టంగా వేసేది.

సావిత్రి,జమున ఇద్దరూ అక్క చెల్లెలు లాగా ఉండేవారు. జమున వాళ్ళ నాన్నకు కళాకారులు అంటే చాలా గౌరవం. సావిత్రి గారు చేసే నాట్యం చూసి చాలా మురిసిపోయేవారు. అంతేకాదు జమునతో సమానంగా సావిత్రిని కూడా తన కూతురిలాగే భావించేవారు. సావిత్రి పెద్దగా చదువుకోకపోయినా ఒకసారి డైలాగ్ వింటేనే ఇట్టే టకటకా చెప్పేది. ఇక సంసారం అనే సినిమాలో సావిత్రి డైలాగులు సరిగ్గా చెప్పకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.

ఇక ఈ మధ్యన సావిత్రి జీవిత చరిత్రగా తెరకెక్కిన మహానటి సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ సావిత్రి జీవితంలో జరిగినవే. సావిత్రి మొదట ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపు చూసి నాగిరెడ్డి చక్రపాణి పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ముందే ఊహించారు. జెమినీ గణేషన్ మొదట్లో ప్రొడక్షన్ వ్యవహారాల పనులు చూసేవారు. ఆయన కూడా సావిత్రి మొహంలో ఏదో కల ఉండేది అంటూ ఎప్పుడూ చెప్పేవారు. మల్లెపూలన్నా, వర్షం అన్నా మహానటి సావిత్రి కి చాలా ఇష్టం.

అలాగే ఎస్వి రంగారావు గారిని సావిత్రి బావ అని ముద్దుగా పిలిచేది.ఇక సావిత్రి బెడ్రూంలో ఏ వైపు చూసినా కూడా జెమినీ గణేషన్ అలాగే సావిత్రి ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటోలే ఎక్కువగా ఉండేవి. రూమ్ లో ఏ దిక్కు చూసినా అవే ఫోటోలు కనిపించేవి. ఇక ఈ విషయం బట్టి చూస్తే జెమినీ గణేషన్ ని సావిత్రి ఎంత ప్రేమించిందో అర్థం చేసుకోవచ్చు. సావిత్రి జెమినీ గణేషన్ ని అంత పిచ్చిగా ప్రేమించింది కాబట్టి జెమినీ గణేషన్ విషయంలో కొన్నింటిని తట్టుకోలేకపోయింది అంటూ ఇమ్మంది రామారావు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *