సమంత అనారోగ్యం కారణంగా ప్రభావం చూపిన సినిమాలలో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి. శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో చేస్తూ ఉండగా నిర్విరామంగా సాగుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ను ఆపింది సమంత అనారోగ్యం. 2, 3 నెలలుగా ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలుకాక పోవడం నిజంగా విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో కలవరపరిచే విషయం అనే చెప్పాలి.

రేపు మాపో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చిత్ర బృందం చెబుతున్న నేపథ్యంలో సమంత ఇప్పుడు ఫిట్ గా కనబడుతూ ఉండడం ఈ సినిమా తొందరగానే మొదలు కాబోతుంది అని చెబుతున్నారు. ఇటీవల యశోద సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ ముద్దుగుమ్మ పాల్గొనగా త్వరలోనే ఆమె కెమెరా ముందు చేయబోతుంది అని చెబుతున్నారు.

ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకులను అలరించబోతున్న ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరికొన్ని సినిమాలను చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తొందరలోనే ఆయన చేయబోయే తదుపరి సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఖుషి సినిమా మళ్లీ మొదలుపెట్టే విధంగా రంగం సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది అని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *