సౌత్ స్టార్ సమంత ఎప్పుడైతే తనకు సోకిన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట పెట్టిందో అప్పటినుండి ఫ్యాన్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారు, సన్నిహితులు సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారట. రీసెంట్ ఇంటర్వూలోనూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అవడం చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి అయితే గురయ్యారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చిందట..

ఆమె నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన ‘యశోద’ నవంబర్ 11న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో, రికార్డ్ రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ బరిలో దూసుకెళ్తోంది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం చూసి ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యపోయారట.. ఇదిలా ఉంటే, ఇప్పుడు సమంత మనసు మార్చుకుంది అనే వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆరోగ్యం కుదుటపడగానే నేరుగా మాజీ మామ నాగార్జున ఇంటికే వెళ్లాలనుకుంటుందట సమంత.

దీంతో తను అనారోగ్యంతో బాధ పడుతుంటే త్వరగా కోలుకోవాలని అందరూ కూడా పోస్టులు చేశారు కానీ.. మాజీ భర్త నాగ చైతన్య కానీ, మాజీ మామ నాగార్జున కానీ రెస్పాండ్ అయితే కాలేదు కదా మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? అంటే.. ఆసక్తికర విషయాలు అయితే తెలుస్తున్నాయి.. సామ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు పోస్ట్స్ చేయకపోయినా కానీ అక్కినేని ఫ్యామిలీ పర్సనల్‌గా తనకు బాగానే సపోర్ట్ చేసిందట.. దీంతో మనసు మార్చుకుని, విడాకులు వెనక్కి తీసుకుని, కుటుంబంతో కలిసి పోవాలని అనుకుంటుందని సమాచారం…విడిపోవడానికి కారణాలు ఏంటనేవి ఇప్పటివరకు కూడా తెలియక పోయినా కానీ రకరకాల పుకార్లు అయితే తెగ పుడుతూనే ఉన్నాయి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *