రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు వెళ్లడం నిజంగా తెలుగు సినిమా యొక్క ఖ్యాతి నీ ఎంతో పొందింది అని చెప్పవచ్చు. ఈ సినిమాను ప్రపంచంలోని వివిధ భాషలలో విడుదల చేసి అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంటూ ఉండగా తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉండడం అందరి అభిమానులను ఎంతగానో ఆనంద పరుస్తుంది.

రాజమౌళి ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారని ఆసక్తి కనబరుస్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇంకా ఆపకుండా జరుపుతున్న రాజమౌళి ఒకానొక సందర్భంలో ఈ సినిమా యొక్క సీక్వెల్ చేయాలని ఉంది అని వెల్లడించారట. ఏదేమైనా ఇంతటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయాలని ఆలోచన ఎంతో మంచిది అని ఆయన అభిమానులు చెబుతున్నారు.

అలా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో  చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యే నాటికి మరొక రెండు మూడు సంవత్సరాలైనా పడుతుంది కాబట్టి ఈ సినిమాను ఆ తరువాత చేస్తాడా అనేది చూడాలి. అప్పటికి ఎన్టీఆర్ మరియు రాంచరణ్ ఇద్దరు కూడా వారి టైమును బట్టి ఈ సినిమాను చేస్తారు.

ఇక వచ్చేయడాది మహేష్ బాబు సినిమాను మొదలుపెట్టబోతున్న రాజమౌళి సమంత రగా ఈ సినిమాకు సంబంధించిన పనులను కూడా చేయబోతున్నాడని అంటున్నారు ఇప్పటికే ఓ లైన్ తన తండ్రికి వివరించగా ఆయన దానికి ఫుల్ చుట్టూ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది ఏదేమైనా ఇంతటి భారీ సినిమాకు సీక్వెల్ చేయడం అంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని అనే చెప్పాలి. ఈ రిస్కు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *