ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్31′. తాజాగా ఈ చిత్రంపై క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారట.ఆర్నెళ్ల నుంచి తారక్ తదుపరి సినిమాలపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అప్సెట్ అవుతున్నారు. ఎన్టీఆర్ 30, 31వ చిత్రాల నుంచి ప్రస్తుతం అప్డేట్స్ కోసం ఎదరుచూస్తున్నారు.

ఈ క్రమంలో ‘ఎన్టీఆర్ 31’ నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా అదిరిపోయే న్యూస్ ఒకటి నెట్టింట సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరికొద్ది నెలల్లో ఈ సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటి నుంచే కొద్దికొద్దిగా పనులు కూడా మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ‘ఎన్టీఆర్31’ను తెలుగు బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ చిత్ర నిర్మాణంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. NTR31ను కేవలం తెలుగులోనే రూపొందించకుండా.. కన్నడలోనూ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మొదట తెలుగులో నిర్మించిన మిగితా భాషల్లో డబ్ చేయాలని కూడా భావించారంట. కానీ, ఒకేసారి తెలుగుతో పాటు కన్నడలోనూ నిర్మించబోతున్నట్టు సమాచారం అందుతోంది.

తారక్ కు కూడా కన్నడ భాష స్పష్టంగా రావడంతో పాటు అక్కడా ఆయనకు వీరాభిమానులు ఉండటం మూలంగా డైరెక్ట్ గా కన్నడలోనే నిర్మించాలని భావిస్తున్నారని తెలుస్తుంది.. మరోవైపు ఎన్టీఆర్ తల్లి కూడా కన్నడ ప్రాంతానికి చెందినది కావడంతో ‘ఎన్టీఆర్ 31’ను కన్నడ, తెలుగులో బైలింగ్వల్ గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఎన్టీఆర్31’ నుంచి వచ్చిన పోస్టర్ తోనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *