పవన్ కళ్యాణ్ తో చేయవలసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా క్యాన్సల్ కావడంతో దర్శకుడు హరీష్ శంకర్ తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆయన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వీరి కలయికలో చేయబోతున్నారని వార్తలు వచ్చిన కూడా ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను ప్రతి ఒక్కరు కనపరిచారు.

పవన్ కళ్యాణ్ సినిమా పూర్తిగా క్యాన్సల్ అవ్వడం ఈ సినిమా రాబోతుంది అని చెబుతున్నారు. తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్న నేపథ్యంలో సిద్ధార్థ రాయ్ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం వాడబోతున్నారని తెలుస్తుంది. ఈ టైటిల్ ను గతంలో పవన్ కళ్యాణ్ తన సినిమాలో ఉపయోగించిన విషయం తెలిసిందే.

అలా మళ్లీ పవన్ కళ్యాణ్ ఊతపదం అయిన సినిమాను తన చిత్రానికి టైటిల్ గా పెట్టబోతున్నారు విజయ్ దేవరకొండ. తొందరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను ఇప్పటికే మొదలు పెట్టి సగభాగం పూర్తి చేశాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తుండగా కలిసి మనకు సినిమాను చేయబోతున్నాడు ఈ హీరో.

లైగర్ సినిమా తర్వాత ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయినా ఈ హీరో ఇప్పుడు చేస్తున్న ఈ రెండు సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *