సూపర్ స్టార్ కృష్ణ గారికి గుండెపోటు రావడంతో.. ఆదివారం నాడు తెల్లవారు జామున గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో ఆయనను అడ్మిట్ చేశారు నమ్రత గారు. అయితే మొదట్లో ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లినట్టు సీనియర్ నటుడు మరియు విజయనిర్మల కొడుకు అయిన నరేష్ చెప్పుకొచ్చారు.కానీ పరిస్థితి క్రిటికల్ అని తర్వాత తెలిసింది. 8 మంది డాక్టర్లు కృష్ణగారికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆయన్ని వైద్యులు కాపాడలేకపోయారు.

ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు ఆయన మరణించారు.హార్ట్ ఎటాక్ వల్ల కిడ్నీ వంటి అవయవాలు కూడా డామేజ్ అవ్వడంతో… చావుతో ఆయన ఫైట్ చేసి చివరి శ్వాస విడిచింది. దీంతో మహేష్ కుటుంబంలోనే కాకుండా టాలీవుడ్లో కూడా విషాద ఛాయలు అయితే అల్లుకున్నాయి. సెలబ్రిటీలంతా కృష్ణ పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కృష్ణ కి అత్యంత సన్నిహితుడు అయిన మోహన్ బాబు కూడా అక్కడికి వెళ్లడం జరిగిందట.

ఈ క్రమంలో ఆయన చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. కృష్ణ గారి పార్థీవ దేహాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయారట. వెక్కి వెక్కి ఏడ్చేశారు. మోహన్ బాబుని గతంలో ఇలా ఎప్పుడూ కూడా ఇలా చూడలేదు అనే చెప్పాలి. ఒక్క అంబరీష్ చనిపోయిన టైంలో మాత్రమే మోహన్ బాబు కంట్రోల్ చేసుకోలేనంతగా ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారి కోసమే మోహన్ బాబు అంతలా ఏడ్చారని చెప్పొచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *