టాలీవుడ్ లో కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే మహేష్ బాబు అమ్మాయి కలల రాకుమారుడిగా మారిపోయి ఎంతో మందికి డ్రీమ్ బాయ్ గా అయిపోయాడు.

మహేష్ హ్యాండ్ సమ్ లుక్స్ కి అమ్మాయిలతో పాటు హీరోయిన్లు కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ మధ్యనే సర్కార్ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా ను తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోగానే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి సినిమా చేయడానికి మహేష్ బాబు ఒప్పుకున్నాడు.

అయితే ఈ మధ్యనే మహేష్ బాబు తల్లి అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తన తల్లి చనిపోయేముందు ప్రతిసారి తన మనవరాలకు ఓణీల ఫంక్షన్ చేయమని చెప్పేదట. కానీ మహేష్ బాబు మాత్రం ఇలాంటి ఫంక్షన్లు ఏమి వద్దు అంటూ తన తల్లి కోరికను కాదన్నాడట. ఇక ఈ విషయంలో తల్లి మాట వినకుండా మహేష్ బాబు తప్పు చేశానని తన తల్లి చనిపోయాక ఎంతో కుమిలిపోయాడట.

ఇక తల్లి చివరి కోరిక ప్రకారం సితార కు ఓనీల ఫంక్షన్ చేద్దామని మహేష్ బాబు అనుకున్నాడు. కానీ ఇంతలోనే సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి మహేష్ బాబుని మళ్లీ పుట్టాడు దుఃఖంలోకి నెట్టేసాడు. ఇక ఈ వార్త వినగానే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *